వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతూ పేదలపై కేంద్రం భారం మోపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ ప్రియాంక కక్కర్ ఆరోపించారు. ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రధాన రహదారిపై చీపుర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
మోదీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో బలపడతామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: వాళ్లకు ఓటుతో గుణపాఠం చెబుదాం: బండి సంజయ్