సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకుకూరల పండగ ఆద్యంతం ఆకట్టుకుంది. మాచనూర్ శివారులోని పచ్చసాలె ప్రాంగణంలో నిర్వహించిన ఆకుకూరల పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వినియోగదారులు పాల్గొన్నారు. చిరుధాన్యాల సాగులో భాగంగా పండే ఆకుకూరలతో వండిన కూరలను హాజరైన పర్యావరణ ప్రేమికులకు అందజేశారు. ఈ సందర్భంగా పంటల సాగు పొలాల్లో కలుపు తీత, చిరుధాన్యాల పంటల నమూనాలు, సహజసిద్ధంగా పండే 150 రకాల ఆకుకూరలను ప్రదర్శించారు. నిత్యం తీరిక లేకుండా గడిపే పట్టణవాసులు కుటుంబ సభ్యులతో పంట పొలాలకు తరలివచ్చి సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి : భాజపా కార్యాలయంలో పదాధికారులతో జేపీ నడ్డా సమావేశం