సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో చిక్కుకున్న ఏడుగురిని సురక్షితంగా రక్షించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న పెంపుడు జంతువులు సైతం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వారు ఏటిగడ్డకిష్టపూర్ వద్ద మంజీరా నది వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలో ఏడుగురు వ్యక్తులు నిదురించారు. సింగూరు గేట్ల ఎత్తివేతతో తెల్లవారుజాముకల్లా వారిని నీరు చుట్టుముట్టి ప్రమాదంలో చిక్కుకున్నారు.
ఇదీ చూడండి : యశోద ఆసుపత్రిలోకి భారీగా చేరిన వరద నీరు