ETV Bharat / state

పారేసుకున్న పర్సు.. యువతి ప్రాణాలను కాపాడింది.. ఎలాగంటే..? - సజ్జనార్​ ట్వీట్ ద్వారా ఓ మహిళను కాపాడారు

ఓ యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సు ఎక్కింది. అనంతరం ఓ స్టాప్​ దగ్గర దిగి వెళ్లిపోయింది. కానీ తనతో తెచ్చుకున్న పర్సు మాత్రం ఆ బస్సులోనే పడిపోయింది. ఇప్పుడు ఆ పర్సు.. ఆ యువతి ప్రాణాలను రక్షించింది. ఎలాగంటారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Sangareddy district
Sangareddy district
author img

By

Published : Dec 26, 2022, 9:34 AM IST

ఆదివారం మధ్యాహ్నం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతం.. ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కి సికింద్రాబాద్‌ జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ దిగిపోయాక.. బస్సులో ఓ పర్సు పడి ఉండడాన్ని కండక్టర్‌ రవీందర్‌ గమనించారు. అది ఎవరిదో తెలుసుకోవడానికి పర్సును తెరిచి చూస్తే.. అందులో రూ.403 నగదుతో పాటు ఓ లేఖ దొరికింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని ఆ లేఖలో రాసి ఉండడం చూసి ఆయన కంగుతిన్నారు.

పర్సులో యువతి ఆధార్‌ కార్డు ఉండడంతో వెంటనే ఆయన ట్విటర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లారు. సూసైడ్‌ లేఖ, ఆధార్‌ కార్డు ఫొటోలను షేర్‌ చేశారు. ఎండీ తక్షణం స్పందించి.. ఆ యువతిని గుర్తించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. ఆర్టీసీ ఎస్సై దయానంద్‌, మారేడ్‌పల్లి పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఆమెను గుర్తించి కుటుంబీకులకు అప్పగించారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన సిబ్బందితో పాటు కండక్టర్‌ రవీందర్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి: టీ కాంగ్రెస్​లో ఏడాదిన్నరగా ఎవరికి వారే.. సిద్ధమైన దిగ్విజయ్​సింగ్​ నివేదిక

కోటా కోవెలలో విశ్వాసాల గోడ.. కోరిక తీరాలంటూ విద్యార్థుల ఆశల రాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.