ETV Bharat / state

15 నెలల చిన్నారి అనుమానస్పదంగా మృతి.. నానమ్మే చంపిందా? - 15 months girl died in sangareddy

15 month child died suspiciously in Sangareddy: ఉగాది పండగ రోజు సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ పాప మృతి అనుమానాస్పదంగా ఉందని చిన్నారి తల్లి చెబుతుంది.

Suspicious death of a child in Sangareddy
సంగారెడ్డిలో అనుమానస్పదంగా చిన్నపిల్ల మృతి
author img

By

Published : Mar 22, 2023, 8:04 PM IST

15 month child died suspiciously in Sangareddy: కుటుంబంలో కలహాలు వల్ల కొన్నిసార్లు దారుణాలు జరుగుతాయి. చిన్నపాపను కొట్టడానికే మనస్సు ఒప్పుకోదు. అలాంటిది కుటుంబంలో గొడవల కారణంగా ఓ పసి ప్రాణం పోయింది. భార్యాభర్తల గొడవలో 15 నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాప తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని మాచిరెడ్డిపల్లిలో భాగ్యలక్ష్మీ తన భర్త, అత్త ఇద్దరు రోజూ వేధిస్తున్నారని బాధపడేది. ఈరోజు భర్తను డబ్బులు అడిగిందని కొట్టాడు. దీంతో భర్త, అత్తల వేధింపులపై సర్పంచికి ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లింది. తన బాధ చెప్పుకుని వచ్చేలోపు 15 నెలల పాప వైష్ణవి చనిపోయింది.

ఈ విషయం పట్ల తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్నామని కోపంతో తరుచుగా వేధింపులకు పాల్పడుతుందని.. ఆమె అత్త తన కుమార్తెను హత్య చేసిందని ఆరోపించింది. గతంలోనూ ఇలానే ఏడు నెలల పాప అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని రోదిస్తూ తెలిపింది. భర్త వెంకటరెడ్డి, అత్త వనజాత పథకం ప్రకారం పాపను చంపేశారని తల్లి భాగ్యలక్ష్మి కోహీర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పాప వైష్ణవి మృతి చెందినప్పటి నుంచి భర్త వెంకటరెడ్డి, అత్త వనజాత గ్రామంలో కనిపించకుండా వెళ్లిపోయారు. అభం, శుభం తెలియని చిన్నారి మృతి వల్ల తల్లి రోదన చూపర్లను కలచివేస్తోంది. ఆమె భర్త, అత్త ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. పాప మృతికి కారకులు ఎవరో తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పారిపోయిన ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు.

"నా భర్తని డబ్బులు అడిగానని కొట్టాడు. ఇలానే రోజూ నా భర్త, అత్త వేధిస్తున్నారని చెప్పడానికి మా ఊరు సర్పంచ్​ దగ్గరికి వెళ్లాను. ఇప్పుడు ఉంటున్న ఇల్లు మా అత్తదని నన్ను ఉండవద్దని అంటున్నారని చెప్పాను. నాకు, న్యాయం చేయమని అడిగాను. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చే సరికి మా పాప చనిపోయి ఉంది. ఏమైందని నా భర్తని, అత్తని అడిగాను. నేనేం చెయ్యలేదని చెప్పి అత్త... నా భర్తను తీసుకొని పారిపోయింది." - భాగ్యలక్ష్మి, మృతి చెందిన పాప తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.