ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాష్ట్రంలోనూ ప్రతాపం చూపుతోంది. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో ఇద్దరు, అంగడిపేటలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జహీరాబాద్, కొండాపూర్‌లో ఒక్కొక్కరికి కరోనా సోకింది.
ఆర్థిక శాఖమంత్రి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన సంగారెడ్డి చేరుకున్నారు. కలెక్టర్‌తో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు బాధితులను వైద్యచికిత్స కోసం తరలించారు. వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కొత్తగా వచ్చిన ఆరుగురితో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసులు 133కు చేరుకున్నాయి.