రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన యంత్రాంగం... ఇక స్థానిక సంస్థల లెక్కింపు ప్రక్రియకు సిద్ధమైంది. మొత్తం 21 జడ్పీటీసీ, 257 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 41 గదులు, 294 టేబుల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. లెక్కింపు ప్రక్రియలో 352 మంది సూపర్వైజర్లు, 704 మంది సహాయకులు పనిచేయనున్నారు.
ఇదీ చూడండి : 'కార్యకర్తల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం'