ETV Bharat / state

Vijayamma speech at praja prasthanam yatra: 'తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు.. వైఎస్సార్​ విజన్​ నుంచి పుట్టుకొచ్చినవే' - praja prasthana yatra

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్​ రెడ్డి పాదయాత్ర ప్రభంజనం సృష్టించిందని వైఎస్​ విజయమ్మ(Vijayamma speech at praja prasthanam yatra) అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కనబడుతున్న ప్రాజెక్టులన్నీ ఆయన దూరదృష్టితో ఆలోచించినవేనని పేర్కొన్నారు. చేవెళ్లలో 'ప్రజా ప్రస్థానం' పాద యాత్ర సందర్భంగా.. సభలో ప్రసంగించిన విజయమ్మ.. చేవెళ్ల నుంచే ప్రతి సంక్షేమ పురుడు పోసుకుందని చెప్పారు.

Vijayamma speech at praja prasthana yatra
వైఎస్​ విజయమ్మ
author img

By

Published : Oct 20, 2021, 1:53 PM IST

Updated : Oct 20, 2021, 2:34 PM IST

చేవెళ్లతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని వైఎస్​ విజయమ్మ(Vijayamma speech at praja prasthanam yatra) పేర్కొన్నారు. చేవెళ్ల నుంచే ప్రతి సంక్షేమం పురుడు పోసుకుందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నేటి నుంచి వైఎస్‌ షర్మిల 'ప్రజా ప్రస్థానం' పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ షర్మిల సభ నిర్వహించారు. సభకు హాజరైన విజయమ్మ(Vijayamma speech at praja prasthanam yatra).. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను వివరించారు.

'తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు.. వైఎస్సార్​ విజన్​ నుంచి పుట్టుకొచ్చినవే: విజయమ్మ

తెలంగాణలో ప్రస్తుతం కనబడుతున్న నీటి ప్రాజెక్టులన్నీ రాజశేఖర్​ రెడ్డి దూరదృష్టితో ఆలోచించినవే. ఆయన పాదయాత్రలో పేద పిల్లలు చదువుకోలేక పనులకు వెళ్లడం చూశారు. ఆ బాధలోంచి పుట్టుకొచ్చిందే ఫీజు రీయింబర్స్​మెంట్​. గుడిసె లేని రాష్ట్రం ఉండాలని పేదలకు ఇళ్లు కట్టించారు. ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు అద్దం పడుతూ సర్వతో ముఖాభివృద్ధి అనే నినాదంతో షర్మిల మీ ముందుకు వస్తోంది. వైఎస్‌ఆర్ లేని లోటును నా బిడ్డ షర్మిల తీర్చుతుంది. షర్మిలను ఆశీర్వదించి అక్కున చేర్చుకోండి. -వైఎస్​ విజయమ్మ

చరిత్రను మార్చేసింది

వైఎస్సార్​ పాదయాత్ర చేసి 18ఏళ్లు అవుతోందని(Vijayamma speech at praja prasthanam yatra) షర్మిల వెల్లడించారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారని.. ఆయన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చివేసిందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టేప్పుడు సబితా ఇంద్రారెడ్డి వద్దని చెప్పినప్పటికీ.. ఆయన వినకుండా మంచి ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలుపెట్టినా విజయవంతం అవుతుందన్నారని గుర్తు చేసుకున్నారు.

ఆయన పాదయాత్ర ప్రభంజనం

1,475 కి.మీలు వై.ఎస్ పాదయాత్ర ప్రభంజనాన్ని(Vijayamma speech at praja prasthanam yatra) సృష్టించి.. పార్టీకి అఖండ మెజార్టీ కట్టబెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వంలో పాదయాత్ర అనేక మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. వైఎస్సార్​ లేని లోటును తన బిడ్డ షర్మిల తీర్చుతుందని.. విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. షర్మిలను ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: CM KCR Focus on Drugs Control: పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం

Last Updated : Oct 20, 2021, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.