ETV Bharat / state

YS Sharmila Padayatra: రెండోరోజు వైఎస్ షర్మిల 'ప్రజాప్రస్థానం' పాదయాత్ర - YS Sharmila Padayatra on the second day from Nakkalapally

YS Sharmila Padayatra on the second day from Nakkalapally, rangareddy district

author img

By

Published : Oct 21, 2021, 2:03 PM IST

13:44 October 21

నక్కలపల్లి నుంచి రెండో రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా... వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర..... రెండోరోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి నుంచి మొదలైంది. నక్కలపల్లి లో రైతులబాధలు, పింఛన్ల కోసం వృద్దమహిళలు చెబుతున్న బాధలను అడిగితెలుసుకున్న షర్మిల.. తానున్నాని భరోసా కల్పించారు. గల్లీలో ఉన్న మహిళలు, యువకులతో మాట్లాడిన ఆమె.. వారికి దైర్యం నింపారు. శంషాబాద్ మండలంలోని కవ్వడిగు, మల్కపుర్, ఆందపుర్, నవాజ్ పూర్, కాచరం గ్రామాల్లో పాదయాత్ర అనంతరం రాత్రికి కాచరం క్రాస్ వద్ద షర్మిల బస చేయనుంది.

మొదట సాగిందిలా..

నిన్న మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్​పల్లి క్రాస్​రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ షర్మిల రెండున్నర కిలోమీటర్లు నడిచి.. షాబాద్ క్రాస్​రోడ్​కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్​రోడ్డు వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.

అక్కడ మధ్యాన భోజనం చేశారు. గంట విరామం తర్వాత కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి, అక్కడి నుంచి గుండాల్ క్రాస్​కు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగూడా క్రాస్​రోడ్డుకు చేరుకున్నారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. మొదటిరోజు నక్కలపల్లి సమీపంలో రాత్రి బస చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.