ETV Bharat / state

చేవెళ్ల హత్య కేసులో వీడని మిస్టరీ - women murder and rape in thangadapally

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో కలకలం సృష్టించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం మిస్టరీ ఇంకా వీడలేదు. మృతురాలు గుజరాత్​ మహిళగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల అక్కడ అదృశ్యమైన స్త్రీ పోలికలుండడం వల్ల మృతురాలు ఆమెనా అని అనుమానిస్తున్నారు.

women-mystery-murder-in-chevella-rangareddy-district
చేవెళ్ల హత్య కేసులో వీడని మిస్టరీ
author img

By

Published : Mar 19, 2020, 8:10 AM IST

రాష్ట్ర రాజధాని శివారులో కలకలం సృష్టించిన గుర్తు తెలియని మహిళ మృతదేహం మిస్టరీ వీడలేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన దిగువన ఈ మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే. మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, చర్మం రంగు ఆధారంగా గుజరాత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లేదా ఉన్నత కుటుంబానికి చెందిన మహిళ అయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్‌లో ఇటీవల అదృశ్యమైన ఓ మహిళ పోలికలుండడం వల్ల మృతురాలు ఆమేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై దొరికిన బంగారు ఆభరణాల డిజైన్లు గుజరాత్‌లోనే కనిపిస్తుంటాయని కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ అదృశ్యమైన మహిళ కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు రప్పిస్తున్నారు.

ఎటువైపు నుంచి తెచ్చి ఉంటారు?

మృతదేహం లభించిన చోటు నుంచి మూడు కిలోమీటర్లు దాటితే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి ముగుస్తుంది. అక్కడి నుంచి వికారాబాద్‌ జిల్లా మొదలవుతుంది. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌సాగర్‌ కూడలి నుంచి చిలుకూరు, చేవెళ్ల మండలం ఎన్కెపల్లి, తంగడపల్లి మీదుగా వికారాబాద్‌ వరకు ఉన్న సింగిల్‌ రోడ్డును ఇటీవలే విస్తరించి రెండు వరుసలుగా మార్చారు. వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణమయ్యేవారు మన్నెగూడ, చేవెళ్ల, మొయినాబాద్‌ మీదుగా కాకుండా ఈ తంగడపల్లి రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శవాన్ని వికారాబాద్‌ వైపు నుంచి తీసుకొచ్చారా లేదా హైదరాబాద్‌ వైపు నుంచి తెచ్చి ఇక్కడ పడేశారా అన్నది తేలాల్సి ఉంది. వివాహేతర సంబంధం, ఆర్థిక, కుటుంబ కలహాలు హత్యకు దారితీసి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి, చేవెళ్ల ఏసీపీ రవీందర్‌ రెడ్డి 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఎన్కెపల్లి, కొత్తపల్లి, కౌకుంట్ల, అంతారం, ధన్నారం, సిద్దులూరు గ్రామాలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని భద్రపరిచారు.

నైలాన్‌ తాడుతో ఉరి

ఈ మహిళను గొంతు నొక్కి, తాడుతో ఉరి వేసి చంపినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆ తాడు మృతదేహానికి సమీపంలోనే పోలీసులకు లభ్యమైంది. ఆమెకు పొగతాగే అలవాటు కూడా ఉందని వైద్యులు తేల్చారు. మహిళ మెడతో పాటు చేతులు కూడా కట్టేసినట్లు గుర్తించారు. బండరాతితో మోదడంతో ముఖం కుడివైపు బాగా ఛిద్రమైపోయింది. ఎడమ కంటిపై కమిలిపోయిన గాయాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.