ETV Bharat / state

చెల్లిని ప్రేమించాడు.. వద్దంటే చంపబోయాడు..

కొంతమంది మానవసంబంధాలు మంటల్లో కలుపుతున్నారు. అమ్మాయి కనిపిస్తే... వరసకు ఏం అవుతుందో కూడా ఆలోచించకుండా ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ యువకుడు వావి వరసలు మార్చిపోయి చెల్లినే ప్రేమించాడు. అంతేనా ఆమె ఒప్పుకోలేదని కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమించలేదని చెల్లెలిపై కత్తితో దాడి
author img

By

Published : Apr 17, 2019, 2:57 PM IST

Updated : Apr 17, 2019, 7:09 PM IST

వాడికి వావి వరసలు కూడా తెలియట్లేదు. వరుసకు చెల్లెలు... అయిన ప్రేమించాలంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఆమె అన్నలాంటి వాడివంటూ తిరస్కరించింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న ద్వేషంతో ఆ అమ్మాయిపైకి కత్తితో దాడికి దిగాడు.

అసలేం జరిగిందంటే...

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వీకర్​ సెక్షన్​ కాలనీకి చెందిన రమేశ్​ అలియాస్​ ఉమేశ్​(26).. సొంత చిన్నాన్న కూతురినే ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వెంటపడ్డాడు. అన్నా చెల్లెలి వరుస అయినందున ఆ యువతి ఒప్పుకోలేదు. అంతే అతని అసలు రూపం చూపించాడు. ఇవాళ ఒంటరిగా గుడికి వెళ్తున్న ఆమెను వెంబడించాడు రమేశ్​. కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కత్తితో దాడికి దిగాడు. గమనించిన స్థానికులు రమేశ్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసునమోదు చేసుకుని నిందితుడ్ని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: 'నిరంకుశ, పక్షపాత వైఖరితో ఐటీ శాఖ'

Last Updated : Apr 17, 2019, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.