పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైన్సులు, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు, ఓట్ల లెక్కింపు రోజైన 17న బంద్ కానున్నాయి.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వాటిని మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ల పరిధిలో స్టార్ హోటళ్లలో బార్లు, రిజిస్టర్ అయిన క్లబ్బులు కూడా.. మూసేయాలని కమిషనర్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావారణంలో, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పట్టభద్రుల స్థానానికి ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: కోతుల నుంచి తప్పించుకోబోయి విద్యార్థిని మృతి