ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే వృథా అవుతుందని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ మైలార్దేవ్ పల్లి డివిజన్ దుర్గానగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. దిల్లీలో ప్రాంతీయ పార్టీ ఎంపీలకు గుర్తింపు ఉండదని పేర్కొన్నారు. మరోసారి గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని అభ్యర్థించారు.
కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి: కొండా
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తమ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా విజయం కోసం కృషి చేయాలని కోరారు.
సభ చివర్లో వర్షం పడటం వల్ల అంతరాయం కలిగింది. వర్షంలోనే నేతలు ప్రసంగించి సభను ముగించారు.
ఇవీ చూడండి : నిబంధనలు మాకే కాదు... మీకు కూడా