రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చిప్పలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసోజీ జంగయ్య చారి-కృష్ణవేణి దంపతులకు నలుగురు కుమార్తెలు. ముగ్గురి వివాహం కాగా... చిన్న కూతురు డిగ్రీ చదువుతోంది.
జంగయ్య-కృష్ణవేణి గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టే.. జాతీయ స్థాయి సెంటర్