రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్గట్ గ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్ గౌడ్, కందుకూరి అరుణలు ప్రేమించుకొని.. కులాంతర వివాహం చేసుకున్నారు. యాచారం మండలం మాల్లో 3 నెలల కింద కాపురం పెట్టారు. వారం రోజులుగా వెంకటేశ్ ఇంటికి రాకపోవడం వల్ల అరుణ అత్త వారి ఇంటికి చేరుకుంది. అత్తింటివారు దాడి చేయడం వల్ల ఆమె అక్కడే నిరాహారదీక్ష దిగింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని అరుణ కోరుతోంది.
ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్