రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ వార్డు 24లోని 70, 71, 72 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఎంఐఎం, తెరాస కార్యకర్తల మధ్య ఓటరు జాబితాపై వివాదం మొదలైంది. ఒకరినొకరు తోసుకుంటూ గుంపుగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి : బ్యాలెట్ పేపర్లో ముందే వేసి ఉన్న సిరా..