ETV Bharat / state

ప్రశ్నించేందుకే తెరాస నుంచి బయటకు: విశ్వేశ్వర్​ రెడ్డి - konda vishweshwar reddy

అందరు అధికార పార్టీలోకి వెళ్తుంటే తానొక్కన్నే ప్రశ్నించడానికి తెరాస నుంచి బయటకు వచ్చినట్లు చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపల్లిలో ప్రచారం నిర్వహించారు.

కొండా విశ్వేశ్వర్​ రెడ్డి
author img

By

Published : Apr 4, 2019, 4:32 PM IST

ప్రశ్నించేందుకే తెరాస నుంచి బయటకొచ్చా: విశ్వేశ్వర్​ రెడ్డి
ప్రాంతీయ పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని చేవెళ్ల కాంగ్రెస్​ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పేదలకు సంవత్సరానికి రూ.72వేలు ఇస్తామని తెలిపారు. రైతులకు ఒకే దఫాలో రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాహుల్​ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. ప్రశ్నించడానికే అధికార పార్టీ నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నారు. అనంతరం ఇబ్రహీంపల్లి గేటు నుంచి జాజి గుట్ట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవీ చూడండి:'ఇందూరు లోక్​సభ ఎన్నికలకు అన్నీ ప్రత్యేకమే'

Intro:చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. గురువారం ఉదయం భార్య సంగీత రెడ్డి తో కలిసి చిలుకూరు బాలాజీ దర్శించు కున్నారు. ప్రాంతీయ పార్టీలతో పార్లమెంట్ ఒరిగిందేమీ లేదని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల సంక్షేమం కోసం కనీస ఆదాయ పథకం ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. రైతులకు ఒకే దాత 2 లక్షల రుణమాఫీ చేస్తోందని తెలిపారు. ఇబ్రహీంపల్లి గేటు నుంచి బైక్ ర్యాలీ తో జాజి గుట్ట మీదుగా గ్రామానికి వెళ్లారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.