రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో గోవిందరాజు గుట్టలో పురాతన దేవాలయం ఉంది. గ్రామస్తులు ఆ దేవాలయంలో నిత్యం పూజలు చేస్తూ కాపాడుకుంటున్నారు. పురాతన ఆలయం కావడం, అది కూడా గుట్టల్లో ఉండడం వల్ల తవ్వితే నిధులు దొరుకుతాయని భావించిన ముగ్గురు వ్యక్తులు ఆ ఊరికి వచ్చారు. గోవిందరాజు గుట్టల్లో ఉన్న దేవాలయం వద్దకు వెళ్లారు. గుట్టల మధ్యలో తవ్వకాలు మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఆలయ నిర్వాహకులు అది గమనించారు. గుట్టు చప్పుడు కాకుండా గ్రామస్తులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సెలవుపై ఉన్నాడు. ముగ్గురు నిందితులు ఎక్కడి వారు.. ఎక్కడి నుంచి వచ్చారు అనే వివరాలు తెలియాల్సి ఉందని, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తలకొండపల్లి ప లీసులు తెలిపారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు