రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండల్లోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 12 దుకాణాల్లో దస్త్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. కొన్నింటిలో గడువు దాటిన పురుగు మందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజిలెన్స్ ఏడీఏ నివేదిత, టాస్క్ఫోర్స్ ఎస్సై రవి, ఎస్సీవో అపర్ణ సోదాల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పైపుల కంపెనీలో అగ్నిప్రమాదం.. 3కోట్ల ఆస్తి నష్టం