ETV Bharat / state

అత్యవసరమైతే 9490617234కి కాల్ చేయండి : సీపీ భగవత్

లాక్​డౌ​న్ కారణంగా ఆస్పత్రులకు వెళ్లేందుకు రోగులు, వృద్ధులు, గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత వాహన సేవలను అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర వేళల్లో వాహన సేవల కోసం 9490617234 లేదా 9100995448 ఫోన్ నెంబర్​ను సంప్రదించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు.

అత్యవసర అవసరాల్లో మమ్మల్ని సంప్రదించండి : సీపీ

author img

By

Published : May 5, 2020, 8:36 PM IST

లాక్​డౌన్ వల్ల ఆస్పత్రులకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న రోగులు, వృద్ధులు, గర్భిణీల కోసం రాచకొండ పోలీసులు కల్పించిన వాహన సౌకర్యాన్ని సుమారు 52 మంది వినియోగించుకున్నారు. శ్రీనివాస ట్రావెల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ 5 వాహనాలను గత రెండు వారాలుగా ఉపయోగిస్తున్నారు.

సరిపోకపోతే మరిన్ని వాహనాలు...

ఇప్పటివరకు ఎల్బీనగర్​, ఆదిభట్ల, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, వనస్థలిపురం ప్రాంతాల్లో వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ వాహనాలను ఉపయోగించి డయాలసిస్ రోగులు, గర్భిణీలు, ఇతర రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని వృద్ధులకు నిత్యావసర సరుకులతో పాటు ఔషధాలనూ శ్రీనివాస ట్రావెల్స్ సహకారంతో పోలీసులు అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని వాహనాలను పెంచే యోచిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.