ETV Bharat / state

VC Sajjanar: టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ - VC SAJJANAR TAKES CHARGE TSRTC MD IN BUS BHAVANA

ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్‌ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. సుమారు మూడేళ్ల విరామం తర్వాత ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

VC SAJJANAR TAKES CHARGE TSRTC MD IN BUS BHAVAN, HYDERABAD
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్
author img

By

Published : Sep 3, 2021, 12:15 PM IST

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) సీనియర్‌ ఎండీగా ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌ బస్‌భవన్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి, రెవెన్యూ ఈడీ పురుషోత్తం నాయక్​లతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సైబరాబాద్ సీపీగా పనిచేసిన సజ్జనార్... ఇటీవలే ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. సుమారు మూడేళ్ల విరామం తర్వాత ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీని నియమించడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

సీపీగా తనదైన ముద్ర

సైబరాబాద్ సీపీగా 2013 మార్చి 18న బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. సర్వీసులో తనదైన ముద్ర వేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు.... సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. కొవిడ్ సమయంలో వలస కూలీలను ఆదుకోవడం, సొంత ప్రాంతాలకు తరలించడం కోసం చొరవ తీసుకున్నారు. కొవిడ్ రోగులకు తగిన వైద్యసాయం అందించేందుకు ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్లు అందించడం, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కరోనా వేళ రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోవడంతో సజ్జనార్ ఏడాది వ్యవధిలో 3సార్లు రక్తదానం చేసి.. కమిషనరేట్​ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 5 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు అందించారు. శాఖాపరంగా పలు సంస్కరణలు చేపట్టారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పరిపాలన కొనసాగించారు.

సైబరాబాద్ కమిషనరేట్​కు ఐజీ స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పశ్చిమ మండల ఐజీగా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర గతంలో హైదరాబాద్​లో డీసీపీగాను పనిచేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.