ETV Bharat / state

Accident at gungal: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం - గున్గల్ సమీపంలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ సమీపంలో కారు టైర్లు పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. సాగర్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

author img

By

Published : Feb 7, 2022, 2:53 PM IST

అదుపుతప్పిన కారు బోల్తాపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను వట్టి నాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మటూరి శ్రీకాంత్​గా పోలీసులు గుర్తించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్​కు చెందిన వీరంతా ​ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఘటన జరిగింది.

ఇదీ చూడండి:

bike accident in dundigal: అతివేగానికి యువకుడు బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.