ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు - ఒకరికి గాయాలు

వేగంగా వస్తున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జవహార్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు
author img

By

Published : Aug 11, 2019, 3:07 PM IST

రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ ఓం శ్రీ అపార్ట్​మెంట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకు పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కౌకూరుకు చెందిన వెంకట్, విలాస్, ఆసిఫ్​గా పోలీసులు గుర్తించారు. వెంకట్, విలాస్ మృతి చెందగా.. ఆసిఫ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలానగర్​లోని ఓ హోటల్ పనిచేస్తున్న వీరు విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు
ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.