రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని శ్రీనగర్ ప్యాబ్ సిటి సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతిచెందగా... ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కందుకూరు గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి, భార్గవ్ రెడ్డిలుగా గుర్తించారు. వీరు ప్యాబ్సిటీలోని రేడియంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాలని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.
ఇదీ చూడండి: 'బోర్డు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం స్పందించడంలేదు'