రెవెన్యూ శాఖలో మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ వీఆర్వోగా పనిచేస్తున్న శంకర్ గుర్రంగూడ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి అనే రైతు నుంచి ఎకరా ఇరవై గుంటల భూమి మ్యుటేషన్ విషయంలో లక్షరూపాయల లంచం డిమాండ్ చేశాడు. చివరకు 70 వేలకు బేరం కుదర్చుకున్నాడు. ఈరోజు ఆ రైతు నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
- ఇదీ చూడండి : రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు