రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం డిపో ముందు ధర్నా చేపట్టారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి : అద్దె బస్సుల కోసం పదివేల టెండర్లు