రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌కు ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 127 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.
నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ సాగర్ రహదారిపై తెరాస కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారస్థులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెరాసను అడ్డుకున్న కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు