ETV Bharat / state

నకిలీ డాక్టర్​తో వైద్యం.. ఆందోళనకు దిగిన బంధువులు - రంగారెడ్డి జిల్లా వార్తలు

నకిలీ వైద్యునితో చికిత్స అందించిన ఉదంతం ఎల్బీనగర్​లో వెలుగుచూసింది. ఆరెంజ్​ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగికి మీర్​పేట్​లో పట్టుబడిన నకిలీ వైద్యుడు సాయికుమార్​తో వైద్యం అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

treatment with a fake doctor  Concerned relatives at orange hospital in lb nagar
నకిలీ డాక్టర్​తో వైద్యం... ఆందోళనకు దిగిన బంధువులు
author img

By

Published : Dec 10, 2020, 6:37 PM IST

మీర్​పేట్​లో అరెస్టయిన నకిలీ వైద్యుడు సాయికుమార్​తో చికిత్స అందించారంటూ ఎల్బీనగర్​లోని ఆరెంజ్​ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హయత్​నగర్​కు చెందిన బాలకిషన్ మెడికల్ ఎజెన్సీలో పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ఎల్బీనగర్​లోని ఆరెంజ్​ ఆస్పత్రిలో చేరాడు. అతనికి నకిలీ వైద్యునితో చికిత్స అందించారని బంధువులు ఆరోపిస్తున్నారు. పదిరోజులకు పైగా ఇతర డాక్టర్లు వైద్యం చేసి, పరిస్థితి విషమించాక మరో ఆస్పత్రికి తరలించాలన్నారు. అతను ప్రస్తుతం మరో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు.

ఇదీ చూడండి:మీర్​పేట్​లో శంకర్​దాదా ఎంబీబీఎస్​.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.