ETV Bharat / state

'రికార్డులు పారదర్శకంగా నిర్వహించేందుకే నూతన రెవెన్యూ చట్టం' - ఆమన్ గల్ లో మంత్రుల పర్యటన

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా రైతులు, తెరాస నాయకులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

'రికార్డులు పారదర్శకంగా నిర్వహించేందుకే నూతన రెవెన్యూ చట్టం'

author img

By

Published : Oct 2, 2020, 9:02 AM IST

అవినీతి, అక్రమాలు, కబ్జాలకు ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా రికార్డులను నిర్వహించడానికి ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి అని, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్​లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రం ముందుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రంగారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్​లు అనితా రెడ్డి, పద్మావతి, తెరాస నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిః రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన భూగర్భజలమట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.