RevanthReddy On CM Kcr: రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చమురు, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి రేవంత్ పాదయాత్ర చేపట్టారు. ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర సాగింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చేవెళ్ల అచ్చొంచిందని.. అందుకే ఇక్కడి నుంచి పాదయాత్ర చేశామన్నారు.
కాళేశ్వరంతో ఏం ప్రయోజనం..
రూ.లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా ఏం ప్రయోజనమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అగ్గిపుట్టిస్తానని వెళ్లిన కేసీఆర్ దిల్లీలో ఏం చేశారని నిలదీశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని విమర్శించారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధర లీటరు రూ.60లు ఉండగా ఇప్పుడు 108రూపాయలు అయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో చేతినిండా డబ్బులు తీసుకుపోతే సంచి నిండా సరుకులు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. ఈ ఎనిమిదేళ్లలో పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం రూ.32 లక్షల కోట్లు దోచుకుందని రేవంత్ ఆరోపించారు. అందుకే పంటలకు ధరలు లేవని.. అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అన్నట్లు పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. వరి రైతులు కుప్పల మీదనే ప్రాణాలు వీడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వడ్లు కోనేవరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అందుకు ప్రజలంతా తమకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: