అది సెప్టెంబరు 16వ తేదీ.. ప్రస్తుతం ఫరూఖ్‌నగర్ మండలకేంద్రంలో అంబేడ్కర్‌కాలనీ పక్కన ఉన్న ఆజం అలీకాన్ తోటలో రజాకార్లు సమావేశమయ్యారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పథక రచనలో ఉన్నారు. 300 మందికిపైగా రజాకార్లు సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న భారత సైన్యం షాద్‌నగర్‌కు చేరుకుంది. సెప్టెంబరు 17న తెల్లవారుజామున భారత సైన్యం రజాకార్లను తరిమికొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్ని పోలీసు వాహనాలు వారికోసం గాలిస్తుండగా, ఓ హెలిక్యాప్టర్‌లో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. మొదట ఆజం అలీఖాన్ తోట వద్ద గల రజాకార్ల స్థావరంపై బాంబు వేసి గుంపును చెదరగోట్టారు. తరవాత ప్రస్తుత షాద్‌నగర్ నాలుగు రోడ్ల కూడలి వద్ద మరో బాంబు విసిరారు. ఈ బాంబుదాడిలో ఓ రజాకారు హతమయ్యాడు. తరవాత ప్రస్తుత ఏసీపీ కార్యాలయం వద్ద మరో బాంబు దాడి జరిగింది. ఇక్కడ మరో వ్యక్తి హతమయ్యాడు.
ఉదయం బాంబుల దాడితో ప్రారంభమైన భయం సాయంత్రం వరకు కొనసాగింది. పారిపోతున్న రజకార్ల వాహనాలపై కాల్పులు కూడా జరిగాయి. పోలీసుల దాడులు జరుగుతున్న సమయంలో కొందరు రజాకార్లు ఫరూఖ్‌నగర్ నుంచి కత్తులతో వచ్చి స్థానికులను భయాందోళనకు గురిచేశారు. పోలీసు దళాలు వారిని తమ అదుపులోకి తీసుకోవడంతో కథ సుఖాంతమైంది. రజాకార్లు ఇక్కడి నుంచి పారిపోవాలని సాయంత్రవ మైకుల్లో పోలీసు బలగాలు ప్రచారం చేశారు. ప్రసారమాధ్యమాల ద్వారా నిజాం స్టేట్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి నుంచే సంబరాలు మొదలయ్యాయి. జషాద్‌నగర్ వేదికగా జరిగిన ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఇప్పటికీ ఉన్నారు. తెలంగాణ విమోచన కోసం ఆనాడు జరిగిన పోరాటంలో ఈ సంఘటన ద్వారా షాద్‌నగర్ ప్రాంతం కూడా చరిత్ర పుటల్లో నిలిచింది. ఇక్కడి పోరాటయోధులు బూర్గుల రామకృష్ణారావు, బూర్గుల నర్సింగరావు, ఎన్‌కే రంగారావు, మొగలిగిద్ద శ్రీనివాసరావు,నాగిళ్ల గోపాల్‌గుప్తా లాంటి వాళ్లు స్వరాజ్య పోరుతో పాటు, విమోచన పోరులోనూ పాలుపంచుకుని తమ గొప్పతనాన్ని చాటడం విశేషం.
ఇదీ చదవండిః అందుబాటులోకి వ్యర్థాలతో విద్యుదుత్పత్తి కేంద్రం