రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం జిల్లెలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చనిపోతే మృతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా యజమాని అడ్డుకున్నారు. మానవత్వం మంటగలిసింది అనడానికి ఈ ఘటనే ఉదహరణ అని... యజమాని తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుధీర అనే మహిళ పదేళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గతకొంతకాలంగా చికిత్స తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో శుక్రవారం ఆమె మృతి చెందింది. మృతురాలికి సొంత ఊర్లో ఇల్లు లేదు. అద్దెకుంటున్న ఇంటి దగ్గరకే ఆమె మృతదేహాన్ని బంధువులు తీసుకువచ్చారు. ఇది గమనించిన ఇంటి యజమాని నిరాకరించారు. చేసేది లేక చివరకు రోడ్డుపై మృతదేహాన్ని ఉంచారు. ఈ ఘటన పట్ల కన్నీరు పెట్టుకున్న స్థానికులు... ఇంటి యజమానిని నిలదీశారు.
ఇదీ చదవండి: పెట్టుబడి రూ.100... లాభం లక్షల్లో!