రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఎంపీటీసీ గణేశ్రెడ్డి ఆధ్వర్యంలో మహాలక్ష్మి కిరణా జనరల్ స్టోర్ వారు పేద ప్రజలకు, రోజువారి కూలీలకు నిత్యావరస సరుకులను పంపిణీ చేశారు. సుమారు 100కుటుంబాలకు సరిపడే సరుకులను ఉచితంగా అందజేశారు.
లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని.. రెక్కాడితేకాని డొక్కాడని ప్రజలకు ఈ కరోనా శాపంగా మారిందని ఎంపీటీసీ గణేశ్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో మహాలక్ష్మి కిరాణావారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సరుకులు పంపిణీ చేయడం హర్షనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రంలో ఉపసర్పంచ్ రాంరెడ్డి, కొంతమంది వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సీరియస్గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్