రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం నమోదైంది. చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డి గూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నెల రోజుల క్రితం వైరస్ సోకిన అతడు కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగైంది.
అయితే నాలుగు రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురి కావడం వల్ల గాంధీకి తరలించారు. కాకపోతే అప్పటికే పరిస్థితి విషమించి మరణించినట్లు సమాచారం. మండలంలో ఇప్పటివరకు 30 మంది మహమ్మారి బారిన పడగా.. ఇది తొలి మరణం.
ఇవీ చూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులకు బ్రేక్