న్యాయమైన పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ సెంట్రల్ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నో సేవలందించిన తమకు ఇంత తక్కువ పీఆర్సీని ప్రకటించడం అవమానకరమని రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నారాయణ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో సమావేశమైన వీరు... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
న్యాయమైన పీఆర్సీని ప్రకటించని యెడల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: ఆ ఊరికి 45 ఏళ్లు ఓకే ఒక సర్పంచ్