రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపో ముందు బతుకమ్మ ఆటలతో నిరసన తెలిపారు. కార్మికులకు ఎస్టీయూ, యూటీఎఫ్, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి. సాగర్ రహదారిపై ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం డిపో ముందు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"