తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెదేపా నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ పర్యటనకు వెళ్తున్న ఆయన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బైపాస్‌పై కొద్దిసేపు ఆగారు. అంతకు ముందే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు తెదేపా నేతలు అక్కడికి చేరుకున్నారు. అయితే చంద్రబాబునాయుడిని కలిసేందుకు అనుమతి లేదంటూ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులుతో సహా పలువురు తెదేపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వాహనం ఎక్కియించారు.
వారి అరెస్ట్ తరువాత కొద్ది సేపటికి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ పోలీసుల తీరు సరికాదని వ్యాఖ్యానించారు. వైద్యురాలి హత్య తనను కలిచి వేసిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఫాంహౌస్‌కు ఉన్న భద్రత... మహిళలకు లేదా'