తనకు ఓటు వేస్తే ప్రశ్నించే గొంతుకనై పనిచేస్తానని... ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను బీఎన్ రెడ్డి నగర్ తెదేపా అభ్యర్థి గద్దె విజయ్ నేత అభ్యర్థించారు. డివిజన్లో ఇంటింటి ప్రచారంలో తెదేపాకు ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీతోనేనని... తనకు అవకాశం ఇస్తే డివిజన్ను అభివృద్ధిలో ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు.
16 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ... ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఆయన తెలిపారు. ఈ ఒక్క సారి అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానన్నారు.
ఇదీ చదవండి: సాయంత్రం 6 గంటలలోపు ప్రచారాన్ని ముగించాలి: ఎస్ఈసీ