రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూకట్‌పల్లి తెదేపా ఇన్ఛార్జి నందమూరి సుహాసిని అన్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో భాగంగా అమీర్‌పేట డివిజన్‌లో తెదేపా అభ్యర్థి మద్దిపట్ల వరలక్ష్మితో కలిసి సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్‌లోని బల్కంపేట, లీలానగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్నికల్లో తెదేపాని గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు.
హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తారని సుహాసిని అన్నారు. నగరంలో తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప తెరాస చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. తెదేపాకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులై కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. డివిజన్‌లో తెదేపా జెండా ఎగురవేస్తామని గెలుపు తథ్యమని అభ్యర్థి వరలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మోదీ పర్యటన గురించి నాకు సమాచారమివ్వలేదు: రేవంత్