రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆరోగ్య సంజీవని వనం అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించారు. అనంతరం సైకిల్‌పై పార్క్‌ను చుట్టేశారు. ఈ కార్యక్రమానికి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మొత్తం 129 పార్కులు ఉన్నాయని వాటిలో 59 పార్కులను అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేస్తామని అజయ్ మిశ్రా తెలిపారు. త్వరలో మరిన్ని ఉద్యానవనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:లైవ్: రాజ్యసభలో తలాక్ బిల్లుపై ఓటింగ్