రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన గౌడిచెర్ల రవికి గొర్రెల మంద ఉంది. రాత్రి 2 గంటల సమయంలో కారులో రవి పొలానికి వెళ్లాడు. మందలోంచి గొర్రెల అపహరణకు పాల్పడుతున్న దొంగలు అతని కారు లైట్లను చూసి ఇన్నోవా కారులో రావులపల్లి వైపు వెళ్లారు. రవి వారిని వెంబడించగా కారును అక్కడే వదిలేసి పరారయ్యారు.
ఈ నెల17వ తేదీనుంచి సుమారు 20 గొర్రెలను చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు.. కారును స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఇవీ చూడండి: గవర్నర్కు రేవంత్ లేఖ.. 'శ్రీశైలం విషయంలో జోక్యం చేసుకోండి'