Shamshabad Woman Murder Case Update : హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో గుర్తుతెలియని మహిళను అర్ధరాత్రి కిరాతంగా హత్యచేసి శవాన్ని దహనం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. సాయిఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల మధ్య రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలుతున్న వాసన రావటంతో స్థానికులు నిద్రలేచి కాపలాదారుడిని అప్రమత్తం చేశారు. ఇళ్ల మధ్యన ఖాళీ ప్రదేశంలో మంటను చూసి అనుమానంతో దగ్గరకు వెళ్లగా.. దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకునేలోగా మృతదేహం పూర్తిగా కాలిపోయింది. మహిళ హత్యోందంతంపై చిక్కుముడి వీడేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. దీంతో హత్యకు సంబంధించిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
శంషాబాద్ ఏసీపీ రామ్ చందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. : గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళను తగులబెట్టారని పోలీసులకు సమాచారం అందింది. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దారుణం జరిగిన ప్రదేశాన్ని, సీసీ కెమెరాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వచ్చి మహిళ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
Lady Murder Case at Shamshabad Update : ఈ మేరకు నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనం వివరాలు సేకరించి.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. వైద్యులు ఇచ్చే ప్రాథమిక నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగనుంది. అర్ధరాత్రి మంటలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మహిళ తగులబడుతున్నట్లు గుర్తించారు. హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారా? లేకపోతే సజీవ దహనం చేశారా? మహిళ ఎవరు? ఈ దారుణం చేయడానికి కారణాలు ఏమిటి? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. కేసును ఛేదించేందుకు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళగా పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల పోలీస్ స్టేషన్లలో ఎవరైనా మహిళ కనిపించడం లేదనే ఫిర్యాదులు అందాయా అనే వివరాలను ఆర్జీఐఏ పోలీసులు సేకరిస్తున్నారు.
"అర్ధరాత్రి సమయంలో మహిళ మంటల్లో కాలిపోవడం.. ఓ వాచ్మెన్ చూసి మాకు తెలిపాడు. మృతి చెందిన స్త్రీ ఎవరో ఇంకా తెలియలేదు. కాలికి రెండు మెట్టెలు ఉన్నాయి. ఫ్లవర్ డిజైన్‌తో మరో మెట్టె ఉంది. రెండు కాళ్లకు కలిపి మొత్తం ఆరు మెట్టెలు ఉన్నాయి. 4 గాజులు ఉన్నాయి. మహిళది తక్కువ ఎత్తు. అంతగా అభివృద్ధి చెందని ప్రాంతం అయినందున జన సంచారం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. దగ్గర ప్రాంతాల వారిని.. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తున్నాం. దీని ఆధారంగా ఇద్దరిని అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నాం. పోస్ట్‌మార్టం అయిన తరవాత.. దాని ఆధారంగా దర్యాప్తు మరింత వేగవంతం చేయనున్నాం."- రామ్ చందర్ రావు, శంషాబాద్ ఏసీపీ
ఐదుగురు పిల్లలు, తల్లి సజీవదహనం.. నిద్రలో ఉండగానే..
అసలు ఏం జరిగిందంటే .. : శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కాలుతున్న వాసన రావటంతో స్థానికులు నిద్ర లేచి.. మంటల దగ్గరికి వెళ్లారు. బాగా పరిశీలించి చూడగా ఆ మంటల్లో గుర్తు తెలియలి మహిళ కాలిపోతుంది. దీంతో భయాందోళనకు గురై.. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Woman Killed and Burnt in Shamshabad : శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపేసి కాల్చేశారు
కట్నం కోసం నాలుగు నెలల గర్భిణీకి నిప్పు.. వారంపాటు నరకం అనుభవించి మృతి