రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఈ రోజు వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా... మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది కార్మికులున్నారు. వీరంతా బంగాల్‌కు చెందినవారు కాగా... వరినాట్ల కోసం నారాయణపేట జిల్లాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: Netannaku Cheyutha scheme: 'నేతన్నకు చేయూత'.. సెప్టెంబర్ 1 నుంచి నమోదు ప్రక్రియ