ETV Bharat / state

Santhi Kalyanam : శాంతి కమనీయం.. వైభవోపేతం

Santhi Kalyanam : ముచింతల్ సమతామూర్తి ప్రాంగణంలో శాంతి కల్యాణం వైభవంగా సాగింది. ఈనెల 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు కన్నులపండువగా సాగాయి. చిన్న జీయర్ స్వామి పర్యవేక్షలో ఒకే ముహూర్తాన... 108 భగవాన్ మూర్తులకు కల్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తుల జయజయ ద్వానాల మధ్య సమతామూర్తి ప్రాణగం మారుమ్రోగింది.

Santhi Kalyanam
Santhi Kalyanam
author img

By

Published : Feb 20, 2022, 8:51 AM IST

Santhi Kalyanam : సమతామూర్తి కేంద్రంలో కమనీయ ఘట్టం ఆవిష్కృతమైంది. 108 దివ్యదేశాల్లో కొలువైన భగవన్మూర్తులకు ఏకకాలంలో అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవాలను నిర్వహించారు. చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ముచ్చింతల్‌లోని దివ్యసాకేత క్షేత్రంలో శాంతి కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆయా క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులను రుత్వికులు సమతామూర్తి కేంద్రానికి చేరుకునే ఉజ్జీవన సోపానం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడే 14 మెట్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. సాయంత్రం 6.35 గంటలకు కల్యాణ క్రతువు చేపట్టారు. సీతాసమేత కోదండరాముడిని మొదటి మెట్టుపై కొలువుదీర్చారు. రాత్రి 8.12 గంటలకు అమ్మవారి మెడలో మాంగల్యధారణ చేయించారు. ఈ వేడుకను కనులారా చూసి భక్తజనం తరించింది. వేదపండితులు కల్యాణోత్సవం చేస్తుండగా.. ఆ క్రతువు విశేషాలను చినజీయర్‌స్వామి భక్తులకు హిందీ, తెలుగులో ఎప్పటికప్పుడు వివరించారు. చివరిగా 108 మంది దేవతామూర్తులను అనుసంధానం చేస్తూ దివ్యదేశాల పేర్లు, భగవన్మూర్తుల పేర్లను భక్తులతో పలికించారు. కల్యాణ అక్షతలను ప్రత్యేకంగా 60 కౌంటర్లలో భక్తులకు అందించారు. కార్యక్రమంలో అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్‌స్వామి, శ్రీనివాస వ్రతధర జీయర్‌స్వామి, మైహోం గ్రూపు సంస్థల ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, జీయర్‌ ట్రస్టు ప్రతినిధులు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 108 మంది చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి.

కేసీఆర్‌ సంపూర్ణ సహకారం మాకుంది..

కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్‌ హాజరు కాలేకపోయినా.. ఆయన సంపూర్ణ సహకారం తమకు ఉందని చినజీయర్‌స్వామి తెలిపారు. శనివారం రాత్రి భక్తులనుద్దేశించి ఆయన అభిభాషించారు. ఉత్సవాలకు ముందూ వెనుకా కేసీఆర్‌ అన్ని విధాలా సహకారం అందించి నడిపించారన్నారు. ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని పునరుద్ఘాటించారు. ‘దైవకార్యాలను ఒక వ్యక్తి ప్రత్యక్షంగా నిలబడే చేయక్కర్లేదు.. ఉత్సవాల ప్రారంభానికి ముందు కేసీఆర్‌ అనేకసార్లు వచ్చారు.. కార్యక్రమాన్ని చూసి మార్పులు, చేర్పులు సూచించారు. తర్వాత ఏవో కారణాలతో రాలేకపోయినా, ఆయన పరిపూర్ణమైన భాగస్వామ్యం ఉన్నాయి.. ఉంటాయి’ అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : Medaram jathara 2022: ఘనంగా ముగిసిన మేడారం మహాజాతర..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.