రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పులి మామిడిలో రైతు వేదిక, చిప్పలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహేశ్వరంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. గట్టుపల్లి, చిన్నతూప్ర, నల్లచెరువు గ్రామాల్లోనూ మంత్రి సబిత, జడ్పీ ఛైర్పర్సన్ అనితారెడ్డి పర్యటించారు.
అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసినట్లు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు.
ఇవీచూడండి: బిందెడు నీటి కోసం వారం రోజులు పడిగాపులు