రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆర్సీఐ గేట్‌ను రావిరాల కమాన్ నుంచి కొంగరకలాన్ వరకు ఆర్అండ్ బీ రోడ్డు పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు పనులను ఏప్రిల్‌కల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రోడ్డు పనులు ముందుగా సీఆర్ఎఫ్ నుంచి రూ.30 కోట్లతో చేపట్టాలని భావించారని.. ఆ నిధులు రావిరాల వరకే సరిపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా రూ.9.5 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
చెక్కుల పంపిణీ : అనంతరం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు క్రిస్మస్ కానుకల పంపిణీ చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అండగా నిలబడుతున్నారని అన్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల వారిని ప్రభుత్వం సమానంగా గౌరవిస్తూ బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో పండుగ జరుపుకోనున్న క్రైస్తవ సోదర, సోదరీమణులకు మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 1,500 కుటుంబాలకు క్రిస్మస్ కానుకలు అందిస్తున్నామన్నారు. ఈ ఒక్క రోజే 55 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తుండగా.. 4 ఏళ్ల కాలంలో 4,833 మందికి రూ.48 కోట్ల పైచిలుకు విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించినట్లు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: