ETV Bharat / state

ఒక్క రోడ్డు ప్రమాదం.. 3 కుటుంబాల్లో విషాదం

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల ఆలూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడం వల్ల స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. వృద్ధ దంపతులకు ఆసరాలేకుండా పోయింది. అప్పుడే స్థిరపడుతున్న కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారణం మద్యం, అతివేగమే కారణమని తెలుస్తోంది.

ఒక్క రోడ్డు ప్రమాదం.. 3 కుటుంబాల్లో విషాదం
ఒక్క రోడ్డు ప్రమాదం.. 3 కుటుంబాల్లో విషాదం
author img

By

Published : Jun 1, 2020, 11:38 AM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారు చెట్టును ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. మృతులు ఆలూరు మండలానికి చెందిన రాఘవేందర్‌, నరేశ్‌, రవిందర్​గా గుర్తించారు.

అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నప్పటినుంచి ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన ఎన్కతల రాఘవేందర్(30) వికారాబాద్ జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. సార నరేశ్​ (30) బీటెక్ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. గారెల రవీందర్(32) ప్రైవేట్ ఉద్యోగి, నరుకొండ నవీన్​ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు.

ఆదివారం నరేశ్​ కారులో చేవెళ్లకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా మీర్జాగూడ గేటు సమీపంలో కారు అతి వేగంతో రోడ్డు పక్కన ఉన్న మర్రిచెట్టుకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కారు బలంగా చెట్టును ఢీకొనడం వల్ల కారులో ఇరుక్కుపోయి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు జేసీబీ సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

వివాహమై ఏడాది తిరగక ముందే..

రాఘవేందర్​కు ఏడాది క్రితమే వివాహమైంది. భార్య ఎనిమిది నెలల గర్భవతి. కొద్దిగా స్థిరపడుతున్న సమయంలో ఇలా కావడం ఆ కుటుంబాన్ని శోకసముద్రంలో నింపింది. నారాయణ, కమలమ్మలకు ఒక కుమారుడు రవీందర్, ఒక కుమార్తె. కూలీ పనులు చేసి కొడుకును చదివించి, కూతురు వివాహం చేశారు. రవిందర్​ హోటల్​, దాబాల్లో పని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు కావడం వల్ల పూర్తిగా ఇంటిపట్టునే ఉన్నారు. ఈ ప్రమాదంతో మూడు కుటుంబాల వారికి ఆసరా లేకుండాపోయింది.

స్నేహాన్ని మద్యం ముంచింది

ఆదివారం కావడం వల్ల స్నేహితులంతా కలిసి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామంలోనే ఉన్నారు. అనంతరం నలుగురు కలిసి నరేశ్​ కారులో చేవెళ్లకు వచ్చి మద్యం తీసుకొని మార్గమధ్యలో ఉన్న పొలాల్లో కూర్చొని తాగారు. తిరిగి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండగా అతి వేగంగా రోడ్డు పక్కన మరిచెట్టుకు ఢీకొనడం వల్ల మృతి చెందారు.

ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.