ETV Bharat / state

'ఆపదలో ఉన్నవారిని మానవత్వంతో ఆదుకోవాలి' - లిటిల్​ ల్యాంబ్ చర్చి

ఆపదలో ఉన్న వారిని మానవత్వంతో ఆదుకోవాలని లిటిల్​ ల్యాంబ్ చర్చి పాస్టర్ సుదర్శన్​రావు అన్నారు. హైదరాబాద్​ వనస్థలిపురం పరిధిలోని పాస్టర్లకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Rice and groceries distribution for Church  pastors
వనస్థలిపురం పరిధిలోని పాస్టర్లకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Jun 20, 2021, 9:32 PM IST

కరోనా రెండోదశలో అందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని లిటిల్​ ల్యాంబ్ చర్చి పాస్టర్ సుదర్శన్​రావు అన్నారు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. హైదరాబాద్​ వనస్థలిపురం పరిధిలోని 50 మందికి పైగా పాస్టర్లకు 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

సామాజిక సేవలో భాగంగానే గత సంవత్సరం లాగానే నిత్యావసరాలు అందిస్తున్నట్లు చర్చి ప్రతినిధులు తెలిపారు. లాక్​డౌన్ లేకున్నా ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. త్వరలోనే కొవిడ్ మహమ్మరి ప్రపంచం నుంచి అంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వనస్థలిపురం పరిధిలోని పాస్టర్లకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

ఇదీ చూడండి: KTR:హైదరాబాద్​లో వ్యాక్సిన్​ టెస్టింగ్​ సెంటర్​ ఏర్పాటుచేయండి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.