ETV Bharat / state

ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు? - తాగుడుకు బానిసై దొంగైన సర్పంచ్

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మాజీ సర్పంచ్ దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మహాలింగపురంలో వృద్ధురాలి గొలుసు చోరీ చేస్తూ పోలీసులకు చిక్కారు. ఇంతకీ అతను దొంగగా ఎందుకు మారాడంటే...

ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?
author img

By

Published : Nov 8, 2019, 5:24 AM IST

Updated : Nov 8, 2019, 7:41 AM IST

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలోని మహాలింగపురంలో మూడు రోజుల క్రితం వృద్ధురాలి మెడలో నుంచి బంగారం గొలుసును ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. చోరీ చేసిన వ్యక్తిని శంకర్​పల్లి పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రెండున్నర తులాల బంగారం, ఒక మోటార్​ సైకిల్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ చేసింది ఓ మాజీ సర్పంచ్ అని సీఐ లింగయ్య, ఎస్సై ప్రవీణ్ తెలిపారు. పదేళ్లు వెంకటాపురం గ్రామానికి సర్పంచ్​గా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి.. తాగుడుకు బానిసై ఇలా దొంగతనాలకు అలవాటుపడ్డారని తెలిపారు.

ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

ఇదీ చదవండిః 'ఎర్ర' దొంగలు దొరికారు... హైదరాబాద్​లో ఎర్రచందనం ముఠా అరెస్ట్

Intro:తాగుడుకు బానిసై దొంగతనానికి అలవాటు పడి పోలీసులకు చిక్కిన మాజీ సర్పంచ్*Body:*తాగుడుకు బానిసై దొంగతనానికి అలవాటు పడి పోలీసులకు చిక్కిన మాజీ సర్పంచ్*

రంగారెడ్డి జిల్లా:శంకర్ పల్లి లోని మహాలింగపురం లో వృద్ధురాలి పై జరిగిన చైన్ స్నాచింగ్ పై ప్రెస్ మీట్ నిర్వహించిన చేవెళ్ల ఏసీపీ*

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లోని మహాలింగపురం గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక వృద్ధురాలి మెడలో నుండి బంగారం ను అపహరణకు గురైన సంఘటన లో భాగంగా చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగను పట్టుకుని మీడియా ముందు ప్రవేశ పెట్టిన శంకర్ పల్లి పోలీసులు అతని నుండి రెండున్నర తులాల బంగారం మరియు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ మీడియా సమావేశంలో శంకర్ పల్లి సిఐ లింగయ్య శంకర్ పల్లి ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు.

*చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ* ఈ నెల మూడో తేదీన మహాలింగపురం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఇద్దరు బస్ కోసం వేచియుండగా అటు వైపు నుండి వచ్చిన సదాశివ పెట్ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పట్లోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి వృద్ధురాలిని బైక్ పై ఎక్కించుకుని మార్గ మధ్యలో పొలాల్లోకి ఆ వృద్దురాలిని తీసుకెళ్లి బయపెట్టి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కొని అటునుండి వికారాబాద్ వైపు పారిపోవడం జరిగింది.

ఇది జరిగిన మరుసటి రోజు బీడీఎల్ ఫ్యాక్టరీ దగ్గర శంకర్ పల్లి sot శంషాబాద్ వారి సహకారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా అటువైపు నుండి వచ్చిన పట్లోళ్ల విషువర్ధన్ రెడ్డి పోలీసులకు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని పట్టుకుని విచారించగా అతను నేరం చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుండి రెండున్నర తులాల బంగారం మరియు Ts15Er4362 హీరో గ్లామర్ అను మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే 2001 2011 వరకు అంటే 10సంవత్సరాలు వెంకటాపురం గ్రామానికి సర్పంచ్ గా పనిచేసి తాగుడుకు బానిసై ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డాడని అన్నారు..

*బైట్:చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి*Conclusion:రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల , సుభాష్ రెడ్డి
Last Updated : Nov 8, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.