ETV Bharat / state

వర్ష బీభత్సం నుంచి 350 ఇళ్లకు విముక్తి - ఉస్మాన్​నగర్

భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసిన వర్ష బీభత్సం నుంచి.. ఇంకా కొన్ని కుటుంబాలు కోలుకోలేదు. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగి నగరవాసులు నరకం అనుభవించారు. ఆ విపత్కర పరస్థితిని ఎదుర్కొన్న.. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 350 ఇళ్లకు ఇప్పుడు విముక్తి కలిగింది.

Relief for 350 houses from hyderabad rainstorm
వర్ష బీభత్సం నుంచి 350 ఇళ్లకు విము
author img

By

Published : Dec 25, 2020, 10:43 AM IST

Updated : Dec 25, 2020, 12:27 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పరిధిలోని ఉస్మాన్​నగర్.. వరద విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ముంపునకు గురైన 465 ఇళ్లలో.. 350 ఇళ్లకు విముక్తి కలిగింది. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలతో స్థానికులు 2 నెలల అనంతరం ఊపిరి పీల్చుకుంటున్నారు.

రెండు నెలలుగా.. ముంపు ప్రాంతాల్లో ప్రజల నిత్యవసరాలను తీర్చేందుకు 20మంది సిబ్బందిని అందుబాటులో ఉంచామని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ పేర్కొన్నారు. తమ సిబ్బంది.. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌, క్రిమి సంహారకాలు చల్లుతున్నారన్నారు. భాదితులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

వరదకు ముంపైన కాలనీని పరిశీలిస్తున్న మున్సిపల్​ కమిషనర్​ ప్రవీణ్​ కుమార్​

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్​లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ప్రవీణ్ పేర్కొన్నారు. వారి సహకారంతో సమస్యను వేగవంతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. కొద్ది రోజుల్లో.. సమస్య పూర్తిగా సద్దుమణుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కృషికి.. స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో వర్ష బీభత్సం

Last Updated : Dec 25, 2020, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.